ఓట్లు అడిగే అర్హత చంద్రబాబు, బోండా ఉమకు లేదు

25 Jan, 2024 12:09 IST

విజయవాడ:  చంద్రబాబు, బోండా ఉమకు ఓట్లు అడిగే అర్హత లేదని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ అభివృద్ధిని బోండా ఉమ విస్మరించారని విమర్శించారు. సెంట్రల్‌ నియోజకవర్గంలో 25 వేల మెజారిటీతో వైయస్‌ఆర్‌సీపీ గెలుస్తున్నామని వెల్లంపల్లి శ్రీనివాస్‌ ధీమా వ్యక్తం చేశారు.