ఫేక్ ప్ర‌చారంపై మాజీ మంత్రి జోగి ర‌మేష్ ఫిర్యాదు

15 Oct, 2025 17:54 IST

విజ‌య‌వాడ‌: నకిలీ మద్యం కేసులో జ‌రుగుతున్న తప్పుడు ప్రచారంపై వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, మాజీ మంత్రి జోగి ర‌మేష్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. విజయవాడ సీపీ కార్యాలయానికి మాజీ మంత్రి జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీ‌నివాస్‌, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి , రమేష్ యాదవ్ , వరుదు కళ్యాణి , పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు , టి.జె.ఆర్.సుధాకర్ బాబు వెళ్లి పోలీసు క‌మీష‌న‌ర్‌కు ఫిర్యాదు చేశారు. నకిలీ మద్యం కేసులో తనపై సోష‌ల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని,  దీనిపై విచారణ జరపాలని జోగి ర‌మేష్ సీపీని కోరారు.   సోషల్ మీడియా, కొన్ని మీడియా ఛానెల్స్ లో వచ్చే ఫేక్ వార్తలపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న సీపీని కోరారు.