మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పరామర్శ
22 Apr, 2025 16:45 IST
కాకినాడ జిల్లా: తుని టౌన్ 4వ వార్డులో నిన్న టిడిపి గుండాల చేతిలో దాడికి గురైన ఆరుగుల గంగారాజు కుటుంబాన్ని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పరామర్శించారు. కొండవార పేటకు దళిత సామాజిక వర్గానికి చెందిన ఆరుగొల గంగరాజుపై దాడి టీడీపీ శ్రేణులు దాడికి తెగబడ్డారు. భవాని అనే మహిళపై టిడిపి నేత లావేటి సతీష్ లైంగిక దాడి కేసులో గంగరాజు, అతని భార్య వాణి కుమారి సాక్షులుగా ఉన్నారు. కేసు ఉపసంహరించుకోవాలని గత కొంతకాలంగా వారిని టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు. ఈ క్రమంలో వారిపై దాడి చేసి గాయపరచడంతో ఇవాళ దాడిశెట్టి రాజా పరామర్శించి, అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. దాడికి పాల్పడిన వ్యక్తులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని రాజా డిమాండ్ చేశారు.