సంపద సృష్టి లేదు ..సంపెంగ పువ్వూ లేదు
28 Jan, 2025 11:54 IST
గుంటూరు: సంపద సృష్టించాకే సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తామంటూ ఎన్నికల వాగ్దానాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులెత్తేయడం పట్ల మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు ఎక్స్ వేదికగా స్పందించారు. సంపద సృష్టి లేదు ..సంపెంగ పువ్వూ లేదు అంటూ ఆయన ట్వీట్ చేశారు. నెపాన్ని చంద్రబాబు వైయస్ జగన్ మీద తోసేసి చేతులు పైకి ఎత్తేసాడు. హామీలు గాలికి వదిలేశాడు..గోవిందా ...గోవిందా...! అంటూ చంద్రబాబు, నారా లోకేష్‌ను ట్యాగ్ చేసి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు.