హోంలోనే అసంతృప్తి

4 Nov, 2024 16:56 IST

గుంటూరు:  హోం మంత్రి అనిత‌పై Home లోనే (కూటమిలో)  అసంతృప్తి ఉంద‌ని మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు పేర్కొన్నారు.  ఆంధ్రప్రదేశ్‌లో లా అండ్‌ ఆర్డర్‌పై, పోలీస్‌ శాఖపైనా  ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, హోం మంత్రిగా అనిత పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. ఈ వ్యాఖ్య‌ల‌పై అంబ‌టి రాంబాబు ఎక్స్ వేదిక‌గా స్పందించారు.