టీడీపీ గూండాల దాడి దారుణం
ఎన్టీఆర్ జిల్లా: మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంపై జరిగిన దాడిని మాజీ హోంమంత్రి తానేటి వనిత తీవ్రంగా ఖండించారు. టిడీపీ గూండాలు దాడి చేసి ధ్వంసం చేసిన జోగి రమేష్ ఇంటిని ఆమె పరిశీలించారు. అనంతరం జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా తానేటి వనిత మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో రాజకీయ విభేదాలను హింసతో అణచివేయడం దారుణమని అన్నారు. మాజీ మంత్రి ఇంటిపై దాడి చేయడం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో స్పష్టం చేస్తోందని విమర్శించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం భద్రత కల్పించి, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయ ప్రతీకార ధోరణితో నాయకుల ఇళ్లపై దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి మచ్చ తేచ్చే చర్యలని తానేటి వనిత పేర్కొన్నారు. జోగి రమేష్ కుటుంబానికి వైయస్ఆర్‌సీపీ అండగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు.