తుపాను బాధితుల‌కు భోజ‌న వ‌స‌తి

5 Dec, 2023 15:44 IST

నెల్లూరు: మిచాంగ్‌ తుపాను నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాలపై స్పందించి యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది. మూడు రోజుల ముందు నుంచే జిల్లా కలెక్టర్లు, ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ వచ్చింది.  సీఎం వైయ‌స్‌ జగన్ ఇవాళ అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించి తుపాన్ ప్ర‌భావంపై ఆరా తీశారు. రాష్ట్రంలో తుపాన్ ప్ర‌భావిత ప్రాంతాల్లో ప్ర‌భుత్వం పున‌రావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అన్ని సౌక‌ర్యాలు క‌ల్పించింది. తుపాను వల్ల ఎక్కడా ఇబ్బందికర పరిస్థితి ఉండకూడదని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశించారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశాల మేర‌కు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి సూచనలతో 4 వ.వార్డు లో గిరిజనులకు భోజన వసతి ఏర్పాటు చేశారు. కుమ్మరగుంటలో తుపాను కారణంగా నిన్న తరలించిన పునరావాస కేంద్రంలోని ( పాఠశాలలో) గిరిజనులకు  4 వ.వార్డు కౌన్సిలర్ ఎంఏ.నారాయణ భోజ‌న వ‌స‌తి ఏర్పాటు చేశారు. కార్య‌క్ర‌మంలో సచివాలయ అడ్మిన్ అనిల్ కుమార్, వీఆర్‌వో బాలకృష్ణయ్య, గృహ సారధి ఆలకుంట కృష్ణ, వాలంటీర్ సాయి స్థానికులు ఉన్నారు