రాజకీయ ఉనికి కోసం సభ్యత, సంస్కారం లేకుండా ప్రవర్తిస్తారా?
22 Oct, 2021 12:56 IST
ఉరవకొండ: రాజకీయ ఉనికి కోసం సభ్యత, సంస్కారం లేకుండా ప్రవర్తిస్తారా? అని మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి చంద్రబాబును నిలదీశారు. ఉరవకొండలో రెండో రోజు జనాగ్రహ దీక్ష కొనసాగుతోంది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ..ప్రతిపక్ష పార్టీ ‘రాజకీయాల్లో దిగజారుడు విధానాలకు వ్యతిరేకంగా, ముఖ్యమంత్రిని ఉద్దేశించి బూతులు మాట్లాడుతున్నారని తప్పుపట్టారు. పట్టాభి వ్యాఖ్యలపై చంద్రబాబు క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.