సాయంత్రం వైయస్ జగన్తో ఐఏఎస్, ఐపీఎస్ల భేటీ
27 May, 2019 12:48 IST
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాబోయే ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డితో ఇవాళ సాయంత్రం 4 గంటల సమయంలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్లు భేటీ కానున్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకొని తిరగివచ్చిన వైయస్ జగన్ కొద్ది సేపటి క్రితమే తాడిపల్లె క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వైయస్ జగన్కు గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు.