స్వయం ఉపాధితో ఆర్థికాభివృద్ధి
8 Nov, 2021 10:36 IST
విజయనగరం: మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికాభివృద్ధి సాధించాలని, అందుకు ప్రభుత్వం సహాయ, సహకారాలు అందిస్తుందని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి అన్నారు. కురుపాం నియోజవర్గం లో గుమ్మలక్ష్మీపురం మండలం వైటీసీలో ఐటీడీఏ నిధులతో ఏర్పాటు చేసిన గిరిజన మహిళల టైలరింగ్ సెంటర్‌ను ఆమె ప్రారంభించారు. అలాగే యువకులకు డ్రైవింగ్ ట్రైనింగ్ ముగింపు కార్యక్రమంలో పాల్గొని ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.