ఏయూ విద్యార్థులకు అవసరమైన వైద్యం అందించండి
27 Mar, 2021 15:13 IST
విజయవాడ: ఆంధ్ర యూనివర్సిటీలో కరోనా సోకిన విద్యార్థులకు అవసరమైన వైద్యం అందించాలని డిప్యూటీ సీఎం ఆళ్లనాని ఆదేశించారు. ఏయూలో 65 మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో మంత్రి ఆళ్లనాని విశాఖ డీఎంఅండ్‌హెచ్‌వో సూర్యనారాయణతో ఫోన్‌లో మాట్లాడారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులను మంత్రి అప్రమత్తం చేశారు. ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేసి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. విద్యార్థులకు వైద్యం అందించాలని సూచించారు.