వైయస్ఆర్‌సీపీ శ్రేణులకు నమూనా ఐడీ కార్డుల పంపిణీ
16 Mar, 2026 12:38 IST
గోపాలాపురం: నల్లజర్ల గ్రామంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్‌కు ఇవ్వనున్న నమూనా ఐడీ కార్డులను రాష్ట్ర మాజీ హోం మంత్రి, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, గోపాలపురం నియోజకవర్గ ఇన్‌చార్జి తానేటి వనిత పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కేడర్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. పార్టీ కార్యకర్తలకు గుర్తింపు కల్పించడంతో పాటు కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ ఐడీ కార్డులు ఉపయోగపడతాయని చెప్పారు. కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ మండల అధ్యక్షుడు వెల్లంకి సుబ్రహ్మణ్యం, బంక అప్పారావు, ముప్పిడి వెంకటరత్నం, నక్క పండు, మట్టా లక్ష్మి, చెలరి శ్రీను, తాడిగడప శ్రీనివాస్, ఆదిత్య, మునాఫ్, గొర్రెల సాంబశివ నాయుడు, గుడిసె వీరాస్వామి, జాలది రవి తదితర గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.