ఎన్నికల కమిషనర్‌కు సుప్రీం కోర్టు అక్షింతలు
18 Mar, 2020 15:11 IST
విశాఖ: ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్‌కు సుప్రీం కోర్టు అక్షింతలు వేసిందని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్ నేత దాడి వీరభద్రరావు అన్నారు. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికలు నిలిపివేయడంపై ఎన్నికల కమిషన్‌ను సుప్రీం కోర్టు తప్పుపట్టిందన్నారు. చంద్రబాబుకు స్థానిక సంస్థలపై ఎప్పుడూ విశ్వాసం లేదని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.