పుంగనూరు దాడిలో చూపు కోల్పోయిన పోలీస్.. సీఎం వైయస్ జగన్ సాయం
8 Aug, 2023 18:07 IST
చిత్తూరు: పుంగనూరులో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయిన విషయం తెలిసిందే. చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ మూకలు వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలు, పోలీసులపై దాడులకు పాల్పడ్డారు. ఈ క్రమంలో దాదాపు 13 మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో గాయపడిన ప్రతీ కుటుంబానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అండగా ఉంటామన్నారు. రణధీర్‌కు పది లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.