కమ్యూనికేషన్ సలహాదారుగా జీవీడీ కృష్ణమోహన్
7 Jun, 2019 14:40 IST
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా జీవీడీ కృష్ణమోహన్ నియమితులయ్యారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కమ్యూనికేషన్ సలహాదారుగా జీవీడీ కృష్ణమోహన్ వ్యవహరించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వీ సుబ్రమణ్యం ఉత్తర్హులు జారీ చేశారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి కృష్ణమోహన్ వైయస్ జగన్ వెంటే ఉంటున్నారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేశారు. ఆయన సేవలను గుర్తించి ప్రభుత్వ సలహాదారుగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ నియమించారు.