నేడు మచిలీపట్నానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్
21 Nov, 2020 11:19 IST
అమరావతి: సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం మధ్యాహ్నం మచిలీపట్నం వెళ్లనున్నారు. ఇటీవలే మాతృ వియోగం పొందిన రాష్ట్ర మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ఇంటికి వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తారు. నాని మాతృమూర్తి నాగేశ్వరమ్మ అనారోగ్యంతో బాధపడుతూ గురువారం కన్నుమూసిన విషయం తెలిసిందే.