రేపు విజయవాడలో సీఎం వైయస్ జగన్ పర్యటన
17 Aug, 2023 11:49 IST
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం (18.08.2023) విజయవాడలో పర్యటించనున్నారు. హయత్ ప్లేస్ హోటల్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.
ఉదయం 10.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విజయవాడ గుణదలలో నూతనంగా నిర్మించిన హయత్ ప్లేస్ హోటల్‌ను ప్రారంభిస్తారు. కార్యక్రమం అనంతరం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.