రేపు పోలవరంలో సీఎం వైయస్ జగన్ పర్యటన
5 Jun, 2023 11:17 IST
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం పోలవరంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. అనంతరం పోలవరం పనులపై సీఎం వైయస్ జగన్ అధికారులతో సమీక్షించనున్నారు.
ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి పోలవరం ప్రాజెక్ట్ వద్దకు చేరుకుంటారు, అక్కడ ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం ప్రాజెక్ట్ కాన్ఫరెన్స్ హాల్‌లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.