తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం వైయస్ జగన్ పర్యటన
8 Dec, 2023 12:04 IST
తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం వద్ద స్వర్ణముఖి నదికట్ట తెగి నష్టపోయిన ప్రాంతాల్లో సీఎం వైయస్ జగన్ పర్యటించారు. ఏరియల్ సర్వే ద్వారా తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్ పంట పొలాలను పరిశీలించారు. అనంతరం ఫోటో ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి సందర్శించారు. పంట నష్టంపై సీఎం వైయస్ జగన్‌కు అధికారులు వివరిస్తున్నారు.