విజయవాడకు బయలుదేరిన సీఎం వైయస్ జగన్
26 Nov, 2022 11:17 IST
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ విజయవాడలో పర్యటించనున్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగనున్న రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి తాడేపల్లి నుంచి విజయవాడకు బయలుదేరారు.
ఉదయం 11.10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11.20 గంటలకు తుమ్మలపల్లి కళాక్షేత్రం చేరుకుని రాజ్యాంగ దినోత్సవ వేడుకలలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.