నేడు వైయస్ఆర్ జిల్లాకు సీఎం వైయస్ జగన్
23 Dec, 2020 10:59 IST
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం నుంచి మూడు రోజుల పాటు వైయస్సార్ కడప జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. పులివెందులలో ఆర్టీసీ బస్టాండు, డిపో నిర్మాణం, ఏపీ కార్ల్ భవనాల నిర్మాణం, ఇండ్రస్టియల్ డెవలప్‌మెంట్ పార్కులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేస్తారు. ఈ మేరకు సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదలయ్యింది.