ఏప్రిల్ లో అమలు చేయాల్సిన సంక్షేమ పథకాలపై సీఎం వైయస్ జగన్ సమీక్ష
16 Mar, 2021 13:04 IST
తాడేపల్లి: కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో సీఎం వైయస్ జగన్ వర్చువల్ విధానంలో కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడారు. ఏప్రిల్ నెలలో అమలు చేయాల్సిన సంక్షేమ పథకాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తున్నారు. వైయస్ఆర్ బీమా, జగనన్న తోడు, వైయస్ఆర్ చేయూత, వైయస్ఆర్ ఆసరా పథకాలపై సీఎం సమీక్షిస్తున్నారు.