‘నాడు – నేడు’పై సీఎం వైయస్ జగన్ సమీక్ష
7 Feb, 2020 12:13 IST
తాడేపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో నాడు – నేడు కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సమీక్షా సమావేశం ప్రారంభమైంది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహిస్తున్న ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. పాఠశాలల్లో తొమ్మిది రకాల వసతుల కల్పన అంశంపై సీఎం వైయస్ జగన్ అధికారులతో చర్చిస్తున్నారు.