ఏలూరు ఘటనపై మధ్యాహ్నం సీఎం వైయస్ జగన్ సమీక్ష
11 Dec, 2020 11:42 IST
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అంతుచిక్కని వ్యాధి పై ఇవాళ మధ్యాహ్నం ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. రోజు రోజుకు బాధితుల సంఖ్య తగ్గడంతో ఏలూరు ఊపిరి పీల్చుకుంది. ఇప్పటి వరకు స్థానిక పరీక్షల ఫలితాలు పరిశీలించిన అధికారులు ప్రస్తుతం కేంద్ర సంస్థలు ఇచ్చే నివేదికల కోసం ఎదురు చూస్తున్నారు. ఆయా కేంద్ర సంస్థలు ఈ వ్యాధి వ్యాపించడానికి గల కారణాలపై సీఎం వైయస్ జగన్ ఆరా తీయనున్నారు.