కడప చేరుకున్న సీఎం వైయస్ జగన్
1 Sep, 2022 15:23 IST
వైయస్ఆర్ జిల్లా: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో మూడు రోజులపాటు పర్యటన నిమిత్తం కొద్ది సేపటి క్రితం కడప నగరానికి చేరుకున్నారు. కాసేపట్లో వేముల మండలంలోని వేల్పుల గ్రామ సచివాలయ కాంప్లెక్స్‌ను సీఎం వైయస్ జగన్ ప్రారంభించనున్నారు. 2వ తేదీన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్బంగా వైయస్సార్ ఘాట్‌లో ప్రత్యేక పార్థనలు నిర్వహిస్తారు.