నెల్లూరుకు బయల్దేరిన సీఎం వైయస్ జగన్
6 Sep, 2022 11:10 IST
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటనకు బయల్దేరారు. జిల్లా పర్యటనలో భాగంగా మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్‌లను ప్రారంభిస్తారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక ఫ్లైట్ ద్వారా కడపకు వచ్చి.. అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా నెల్లూరు జిల్లా బయల్దేరి వెళ్లారు. కడప ఎయిర్‌పోర్ట్‌లో సీఎం వైయస్ జగన్‌ను జిల్లా కలెక్టర్ విజయరామ రాజు, ఎస్పీ అన్బురాజన్, పార్లమెంట్ అధ్యక్షుడు సురేష్ బాబు, జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమరనాథ్ రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రనాధ్ రెడ్డి కలిశారు.