నిర్వాసితుల సమస్యలు పరిష్కరించండి

28 Feb, 2020 15:02 IST

 


పశ్చిమగోదావరి: పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలనకు వెళ్లిన సీఎం వైయస్‌ జగన్‌ను పలువురు నిర్వాసితులు కలిశారు. ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్న సీఎం కాన్వాయ్‌ ఆపి మరీ నిర్వాసితులను పలకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వం ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీలో అన్యాయం చేసిందని, తమకు న్యాయం చేయాలని సీఎంను వారు కోరారు. నిర్వాసితుల సమస్యలను సావధానంగా విన్న సీఎం వైయస్‌ జగన్‌.. వారి సమస్యను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజును ఆదేశించారు.