కరోనా వ్యాప్తిపై సీఎం వైయస్ జగన్ సమీక్ష
22 Mar, 2020 17:17 IST
అమరావతి : కరోనా వైరస్ వ్యాప్తిపై ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి ఆళ్లనాని, చీఫ్ సెక్రటరీ నీలం సాహ్నిలు పాల్గొన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్రంలోని తాజా పరిస్థితులను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. పాజిటివ్ కేసుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.