గవర్నర్‌ బిశ్వభూషణ్‌తో సీఎం వైయ‌స్‌ జగన్‌ భేటీ

4 Aug, 2021 18:26 IST

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలిశారు. సీఎం వైయ‌స్ జగన్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌తో బుధవారం సాయం‍త్రం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అంతకుముందు సీఎం వైయ‌స్ జగన్‌ దంపతులు గవర్నర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం గవర్నర్‌ బిశ్వభూషణ్‌ పుట్టినరోజు.. కోవిడ్‌ కారణంగా ఆయన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.