కర్నూలు పర్యటనకు బయల్దేరిన సీఎం వైయస్ జగన్
17 May, 2022 11:41 IST
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి కర్నూల్ జిల్లా పాణ్యం బయలుదేరారు. గ్రీన్‌కో పునరుత్పాదనక విద్యుత్ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ఓర్వకల్లు మండలం గుమ్మితం తండా, పాణ్యం మండలం పిన్నాపురంలలో గ్రీన్‌కో ఎనర్జీస్ లిమిటెడ్ ఈ ప్లాంట్‌ను నెలకొల్పొతుంది. ఒకే యూనిట్ నుంచి సోలార్, విండ్, హైడల్ పవర్లను ఉత్పత్తి చేయడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత.