ఎల్లుండి సీఎం వైయస్ జగన్ కర్నూలు, నంద్యాల జిల్లాల పర్యటన
12 Mar, 2024 22:24 IST
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎల్లుండి (14.03.2024) కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటించనున్నారు. కర్నూలు జిల్లాలో నేషనల్ లా యూనివర్శిటీకి భూమి పూజ నిర్వహించిన అనంతరం, నంద్యాల జిల్లా బనగానపల్లిలో వైయస్ఆర్ ఈబీసీ నేస్తం నిధులు విడుదల చేసి లబ్ధిదారుల ఖాతాల్లో జమచేయనున్న సీఎం.
ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఓర్వకల్లు చేరుకుంటారు, అక్కడ నేషనల్ లా యూనివర్శిటీకి భూమి పూజ నిర్వహించిన అనంతరం, నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్ఆర్ ఈబీసీ నేస్తం నిధులు విడుదల చేసి లబ్ధిదారుల ఖాతాల్లో జమచేయనున్న సీఎం. అనంతరం సాయంత్రం తాడేపల్లి చేరుకుంటారు