రాష్ట్ర ప్రజలకు సీఎం వైయస్ జగన్ గురు పౌర్ణమి శుభాకాంక్షలు
24 Jul, 2021 12:51 IST
తాడేపల్లి: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శనివారం సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు. గురువును దైవంతో సమానంగా పూజించే గొప్ప సంస్కృతి భారతదేశానిది. మంచిని ప్రభోదించి, జ్ఞాన జ్యోతిని వెలిగించే గురువు స్థానం ఎంతో మహోన్నతమైనది. నేడు గురు పౌర్ణమి సందర్భంగా పూజ్య గురుతుల్యులందరినీ స్మరించుకుంటూ.. రాష్ట్ర ప్రజలకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు అంటూ సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు.