రేపు సీఎం వైయస్ జగన్ ఎన్నికల షెడ్యూల్ ఇలా..
28 Apr, 2024 21:14 IST
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సభల 29వ తేదీ షెడ్యూల్‌ను పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం విడుదల చేశారు. సోమవారం వైయస్ జగన్ ఎన్నికల ప్రచారాన్ని మూడు నియోజకవర్గాల్లో నిర్వహిస్తారు. ఉదయం 10 గంటలకు అనకాపల్లి జిల్లా చోడవరంలో కొత్తూరు జంక్షన్ లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు అమలాపురం పార్లమెంట్ పరిధిలో పి గన్నవరం నియోజకవర్గంలో అంబాజీపేట బస్టాండ్ రోడ్ లో జరిగే సభ లో పాల్గొంటారు. ఆ తరువాత మధ్యాహ్నం 3 గంటలకు గుంటూరు పార్లమెంట్ పరిధిలో ని పొన్నూరు ఐలాండ్ సెంటర్ లో జరిగే ప్రచార సభలో వైయస్ జగన్ పాల్గొంటారు.