పద్మ పురస్కార గ్రహీతలకు సీఎం వైయస్ జగన్ అభినందనలు
26 Jan, 2021 11:20 IST
తాడేపల్లి: ప్రతిష్టాత్మక పద్మ పురస్కార గ్రహీతలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఇది రాష్ట్రానికి గర్వకారణమని, పురస్కార గ్రహీతలు ఆయా రంగాల్లో విశిష్ట సేవలు అందించి రాష్ట్రానికి మరింత గుర్తింపు తెచ్చారని సీఎం తన సందేశంలో కొనియాడారు. వాయులీన వైతాళికుడు అన్నవరపు రామస్వామి, ఆశావాది ప్రకాశరావు, దండమూడి సుమతి పద్మ పురష్కారాలు పొందిన వారిలో ఉన్నారు.