వరద ప్రభావిత ప్రాంతాల్లో కాసేపట్లో సీఎం వైయస్ జగన్ ఏరియల్ సర్వే
19 Oct, 2020 13:28 IST
తాడేపల్లి: ఇటీవల కురిసిన వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరద నీటి కారణంగా పలు ప్రాంతాలు, పంటలు నీట మునిగాయి. వరద ప్రభావిత ప్రాంతాలను ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కాసేపట్లో ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించనున్నారు. కృష్ణా, గోదావరి నదీ ప్రాంతాల్లో సీఎం వైయస్ జగన్ వరద పరిస్థితిని పరిశీలించనున్నారు.