జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుకు సీఎం వైయస్ జగన్ పరామర్శ
14 Jul, 2023 11:17 IST
విజయనగరం: వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ను రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహనరెడ్డి పరామర్శించారు. శ్రీనివాసరావు తండ్రి మజ్జి నర్సింగరావు గురువారం ఉదయం మరణించిన విషయాన్ని తెలుసుకున్న ముఖ్యమంత్రి, ఫోన్ ద్వారా పరామర్శించారు. మృతికి కారణాలు తెలుసుకున్నారు. శ్రీనివాసరావు కుటుంబానికి ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు .