చింతమనేని అనుచరుల వీరంగం
21 Aug, 2025 14:36 IST
పశ్చిమగోదావరి: దెందులూరులో చింతమనేని అనుచరులు వీరంగం సృష్టించారు. వైయస్ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఇంటి వద్ద చింతమనేని అనుచరులు హల్‌చల్ చేశారు. కర్రలు, రాడ్‌లతో బీభత్సం సృష్టించారు. అబ్బయ్య చౌదరి పామాయిల్ తోటలోకి టీడీపీ నేతలు చొరబడ్డారు. వారిని వైయస్ఆర్‌సీపీ నేతలు అడ్డుకున్నారు. టీడీపీ నేతలు రౌడీయిజం చేస్తున్నారని వైయస్ఆర్‌సీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు.