ఈసీని కలిసిన చెవిరెడ్డి
15 Feb, 2019 15:11 IST
అమరావతి: ఓటర్ల అక్రమ తొలగింపుపై చర్యలు తీసుకోవాలని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఎన్నికల ప్రధాన అధికారిని కోరారు. అమరావతిలో ఎన్నికల ప్రధానాధికారిని ఎమ్మెల్యే చెవిరెడ్డి కలిశారు. ఈ మేరకు దొంగ సర్వేల పేర్లతో వైయస్‌ఆర్ సీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగిస్తున్నారని, దీని వెనుక చంద్రబాబు హస్తం ఉందని ఫిర్యాదు చేశారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.