విజయానందరెడ్డిపై కేసు నమోదు
11 Jul, 2025 15:17 IST
చిత్తూరు: మామిడి రైతుల కష్టానష్టాలు తెలుసుకునేందుకు ఈ నెల 9న వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో పర్యటించారు. వైయస్ జగన్ పర్యటన విజయవంతం కావడంతో జీర్ణించుకోలేని కూటమి ప్రభుత్వం వైయస్ఆర్‌సీపీ నేతలపై కక్షసాధింపు చర్యలకు తెర లేపింది. చిత్తూరు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి విజయనంద రెడ్డిపై బంగారు పాళ్యం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. హెలిప్యాడ్ వద్ద విధులకు ఆటంకం కల్పించారని, పెద్ద ఎత్తున అనుచరులతో విజయానందరెడ్డి వచ్చి పోలీసులతో దురుసుగా ప్రవర్తించినట్లు బంగారుపాళ్యం ఎస్ఐతో ఫిర్యాదు చేయించి కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది.