18న కేబినెట్ సమావేశం
14 Dec, 2020 09:34 IST
అమరావతి: ఈనెల 18వ తేదీ ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. వెలగపూడి తాత్కాలిక సచివాలయం ఒకటో బ్లాకులోని కేబినెట్ సమావేశ మందిరంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు. అజెండా అంశాలను త్వరగా పంపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అన్ని శాఖల అధిపతులకు సర్క్యులర్ జారీచేశారు.
ఈనెల 15 నాటికి నివర్ తుపాను నష్టాలపై తుది నివేదిక అందనున్న నేపథ్యంలో వ్యవసాయ, ఉద్యానపంటలు దెబ్బతిన్న రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్‌పుట్ సబ్సిడీ) విడుదలతోపాటు వివిధ ముఖ్యమైన అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తారు.