కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం శుభ పరిణామం
16 Jan, 2021 13:56 IST
విజయనగరం: దేశంలో ప్రధానమంత్రి మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిలు కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం శుభ పరిణామం అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వ్యాక్సి్‌న్ తొలి టీకా అందించనున్న సందర్భంగా బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఒక్కో సెంటర్ ద్వారా రోజుకి 100 మందికి వ్యాక్సిన్ అందిస్తామని, ఫ్రెంట్ లైన్ వారియర్స్‌కు అందరికి వ్యాక్సినేషన్ అందిస్తామన్నారు. 18 ఏళ్ల లోపు ఉన్నవారికి, బాలింతలకి వ్యాక్సిన్ వేయబడదన్నారు. రెండో విడత కూడా ఇదే రకం వ్యాక్సిన్ అందజేయాలన్నారు. ఇప్పడు వ్యాక్సిన్ వేసిన వ్యక్తికి మరలా 28 రోజుల తర్వాత రెండో విడత వ్యాక్సిన్ అందజేస్తామన్నారు. రాబోయే రోజుల్లో వ్యాక్సిన్ అందజేస్తామని, ఎవరూ తొందరపడొద్దని మంత్రి బొత్స పేర్కొన్నారు.