ఐదు బిల్లులకు శాసన మండలిలో ఆమోదం
17 Jun, 2020 16:34 IST
అమరావతి: శాసన మండలిలో బుధవారం ఐదు బిల్లులకు సభ్యులు ఆమోదం తెలిపారు. దేవాదాయ శాఖ చట్ట సవరణ బిల్లులకు ఆమోదం లభించింది. అలాగే వ్యాట్, జీఎస్టీ సవరణ బిల్లులకు సభ్యులు ఆమోదం తెలిపారు.ఎక్సైజ్ చట్ట సవరణ బిల్లులకు శాసన మండలి ఆమోదం తెలిపింది. ఉన్నత విద్యా కమిషన్ సవరణ బిల్లుకు సభ్యులు ఆమోద ముద్ర వేశారు.