దివ్యాంగుల ఆందోళనలకు భూమన అభినయ్ మద్దతు
21 Aug, 2025 15:11 IST
తిరుపతి: పింఛన్ల తొలగింపును నిరసిస్తూ తిరుపతి నగరంలో దివ్యాంగులు చేపట్టిన ఆందోళనలకు వైయస్ఆర్‌సీపీ తిరుపతి ఇన్‌చార్జ్ భూమన అభినయ రెడ్డి మద్దతు తెలిపారు. తిరుపతి కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో ఆయన పాల్గొని కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. కక్షసాధింపు చర్యల్లో భాగంగా పింఛన్లు తొలగించి దివ్యాంగులకు అన్యాయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అర్హులైన దివ్యాంగులకు న్యాయం చేయాలని అభినయ్ రెడ్డి డిమాండ్ చేశారు.