వైయస్ఆర్‌సీపీ కార్యకర్తపై దాడి
1 Sep, 2025 12:46 IST
తిరుపతి జిల్లా : శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం కొనతనేరి గ్రామంలో వైయస్ఆర్‌సీపీ కార్యకర్తపై టీడీపీ నాయకులు దాడి చేసి గాయపరిచారు. ఆదివారం రాత్రి ఓ వ్యక్తి పుట్టినరోజు వేడుకలు నడివీధిలో జరుపుకోవటంతో ఇరువర్గాలు ఘర్షణకు దిగారు. దీంతో వైయస్ఆర్‌సీపీ సానుభూతిపరులపై పచ్చమూకలు రాడ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేయడంతో ఒక యువకుడు, మహిళ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు.