ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
22 Mar, 2022 09:59 IST
అమరావతి: ఆంధ్ర్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం అయ్యాయి. ప్రశ్నోత్తరాల్లో ఫైబర్‌గ్రిడ్ అవినీతి, ఆంగ్ల మాధ్యమం, అమ్మఒడి తదితర అంశాలు ఉండనున్నాయి. అనంతరం ప్రభుత్వం పలు బిల్లులను ఆమోదం కోసం సభ ముందు ఉంచనుంది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రగతిపై స్వల్ప కాలిక చర్చ జరపుతారు.