అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం

21 Mar, 2022 09:45 IST

అమ‌రావ‌తి:  ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం తిరిగి ప్రారంభమయ్యాయి. పలు సవరణ బిల్లులను మంత్రులు ప్రవేశపెట్టనున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ ప్రగతిపై స్వల్పకాలిక చర్చ జరపనున్నారు.   హిందూ ఛారిటబుల్‌ సవరణ బిల్లును మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఫారిన్‌ లిక్కర్‌ సవరణ బిల్లును మంత్రి నారాయణ స్వామి ప్రవేశపెట్టనున్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌, టూరిజం, మెడికల్‌ అండ్‌ హెల్త్‌.. విద్యాశాఖ సంబంధించిన బడ్జెట్‌ డిమాండ్‌ గ్రాంట్స్‌పై ఓటింగ్‌ చేపట్టనున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ ప్రగతిపై స్వల్పకాలిక చర్చ జరపనున్నారు.