ఆరో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
15 Mar, 2022 10:01 IST
అమరావతి: ఆరో రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతోంది. సభా కార్యక్రమాలకు టీడీపీ సభ్యులు అడ్డుపడుతున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ సభ్యులు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. రోజూ సభ ప్రారంభం కాగానే రాద్ధాంతం చేస్తున్నారన్నారు.