సుప్రీంకోర్టులో వైయస్ఆర్‌సీపీ నేతలకు ఊరట
25 Feb, 2025 12:49 IST
న్యూఢిల్లీ: టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి జోగి రమేష్, దేవినేని అవినాష్ సహా 24 మందికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసుపై విచారణ జరిపిన జస్టిస్ సుధాంశు దులియా ధర్మాసనం వైయస్ఆర్‌సీపీ నేతలకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. విచారణకు సహకరించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. విచారణకు సంబంధించిన సమాచారాన్ని దర్యాప్తు అధికారికి ఇవ్వాలని, అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని, పాస్ పోర్ట్ సరెండర్ చేయాలని సుప్రీం కోర్టు సూచించింది.