కర్ఫ్యూ వేళల సడలింపు 

18 Jun, 2021 13:43 IST

 తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కట్టడికి విధించిన కర్ఫ్యూ వేళల్లో ప్రభుత్వం సడలింపులు చేసింది. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సడలింపులు అమల్లో ఉంటాయని తెలిపింది. కోవిడ్‌పై ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో కర్ఫ్యూ వేళల్లో సడలింపులు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూన్‌ 21 నుంచి 30 వరకు సడలింపులు అమల్లో ఉంటాయని తెలిపింది. 
 
అయితే సాయంత్రం 5 గంటల వరకే దుకాణాలకు అనుమతి ఇస్తుండగా.. తూర్పు గోదావరి జిల్లాలో మాత్రం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే సడలింపు ఇచ్చారు. కోవిడ్‌ పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్నందున ఈ జిల్లాలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే సడలింపు ఇచ్చారు. ఇక ప్రభుత్వ కార్యాలయాలు యధావిధిగా పని చేస్తాయని తెలిపారు. ఉద్యోగులు అందరూ కార్యాలయాలకు వచ్చేలా మార్పులు చేశారు.