చంద్రబాబు నిప్పు కాదు..తుప్పు
గుంటూరు: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిప్పు కాదు..తుప్పని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఐటీ రైడ్స్‌లో చంద్రబాబు బాగోతం బయటపడిందని అన్నారు. రూ.2 వేల కోట్లు చేతులు మారాయని రుజువైంది.తక్షణమే చంద్రబాబు, లోకేష్‌ను అరెస్టు చేసి విచారించాలి. రాంబాబు మీడియాతో మాట్లాడుతూ..ఇప్పుడే తీగ లాగారు..త్వరలోనే డొంక కదులుతుంది. చంద్రబాబు మాజీ పీఎస్‌ను పట్టుకుంటేనే రూ.2 వేల కోట్లు దొరికాయంటే.. చంద్రబాబు, లోకేష్‌ను విచారిస్తే ఎన్ని లక్షల కోట్లు బయటపడతాయో?. చంద్రబాబు, ఆయన తాబేదారులు దోపిడీకి పాల్పడితే ఎల్లో మీడియా మాత్రం వార్తలు రాయడం లేదు. నీతులు చెప్పే పవన్, సీపీఐ రామకృష్ణ ఎందుకు మాట్లాడటం లేదు. చంద్రబాబు విదేశాలు వెళ్లింది లెక్కలు సరిచూసుకోవడానికే. దొరికిపోయారు కాబట్టే చంద్రబాబు, లోకేష్‌లు నోరు మెదపడం లేదని అంబటి రాంబాబు పేర్కొన్నారు.